మచ్ అవైటెడ్ కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయిపోయింది.సీనియర్ హీరో వెంకటేష్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా రానుందని గత కొంత కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.అన్ని కుదిరితే అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ బరిలో నిలుపనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇంతకుముందు వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ& డైలాగ్స్ అందించాడు.ఇందులో నువ్వు నాకు నచ్చావ్ ఆల్ టైం కల్ట్ మూవీ గా పేరు తెచ్చుకోగా మల్లీశ్వరి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనుండడంతో వీరి కాంబో లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.
ఇదిలావుంటే ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు వెంకటేష్.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.ఇక నెక్స్ట్ కూడా వెంకీ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























