సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ గురువారం భారీ అంచనాల మధ్య వచ్చి డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంటుంది.దాంతో మొదటి రోజు ఈసినిమా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 151 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే వరకు కోలీవుడ్ లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.ఇంతకుముందు లియో 148 కోట్లతో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఉండగా కూలీ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.ఈరెండు సినిమాలను లోకేష్ కనగరాజే డైరెక్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం తమిళంలోనే కాదు అన్ని భాషల్లో కూలీ హావ కొనసాగించింది.తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 20 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకోగా హిందీలో 9 కోట్లు, మలయాళంలో 8 కోట్లు, కన్నడలో 8కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అటు ఓవర్సీస్ లో అయితే రాంపేజ్ సృష్టించింది.నార్త్ అమెరికా లో ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు 8.76 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకొని రికార్డు క్రియేట్ చేసింది.ప్రస్తుతం ఆల్ టైం హైయెస్ట్ యు ఎస్ ఓపెనింగ్స్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతుంది.బాహుబలి 2 11.25 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ తో మొదటి స్థానంలో వుంది.
ఇక రెండో రోజు కూడా కూలీ సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజు,రేపు కూడా కూలీ భారీ వసూళ్లను రాబట్టుకోనుంది.అయితే ఈసినిమాకు తెలుగు, హిందీలో వార్ 2 తో భారీ పోటీ ఎదురుకుంటుంది.లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన కూలీ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున విలన్గా,ఉపేంద్ర,సత్యరాజ్,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరిశాడు. అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























