రీసెంట్ గా భైరవం తో వచ్చి డీసెంట్ హిట్ కొట్టిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సోలో హీరోగా కిష్కింధపురితో రానున్నాడు.ఇందులో శ్రీనివాస్ కి జంటగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తుంది.ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన రాక్షసుడు సూపర్ హిట్ అనిపించుకోగా ఇక ఇప్పుడు ఈ పెయిర్ కిష్కింధపురి తో రానున్నారు.హారర్ థ్రిల్లర్ గా కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచింది.టీజర్ చూస్తుంటే సినిమాతో బయపెట్టేలానే వున్నారు.టీజర్ లో బీజీఎమ్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి.ఈసినిమాకు సామ్ సీఎస్ ,చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 12న విడుదలకానుంది.
ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు ,హైందవ సినిమాలు కూడా చేస్తున్నాడు .టైసన్ నాయుడుని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా హైందవను లుధిర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో ఓ సినిమా కూడా ఈఏడాదే విడుదలయ్యే ఛాన్స్ వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























