రజినీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌స్టార్‌ వరకు

Rajinikanth Completes 50 Years in Film Industry A Journey From Bus Conductor To Superstar

తమిళ్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరు తెలియని వారుండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. రజినీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కూలీ’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన రజినీకాంత్ తాజాగా మరో అరుదైన ఘనతను అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా ఇండస్ట్రీలో ఆయన 50 వసంతాలు పూర్తిచేసుకున్నారు. సాధారణ బస్‌ కండక్టర్‌గా తన జీవితం మొదలుపెట్టి, దక్షిణ భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహానటుడిగా ఎదగడం వరకు రజనీ సాగించిన ఈ పయనం అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ తరుణంలో రజినీకాంత్ గురించి స్పెషల్ స్టోరీ..

1975లో “అపూర్వ రాగంగళ్” అనే తమిళ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన రజనీ, తన ప్రత్యేకమైన స్టైల్‌, అద్భుతమైన డైలాగ్‌ డెలివరీ, ఎనర్జిటిక్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆ తరువాత ‘బాషా’ సినిమాతో ఎన్నో రికార్డులను తిరగరాశారు. దీంతో ఆయన పేరు సూపర్‌స్టార్‌గా ముద్రపడిపోయింది. అక్కడినుండి తెలుగులో సైతం రజినీకి భారీ అభిమానులు ఏర్పడ్డారు. ఇక “ముత్తు, అరుణాచలం, నరసింహా, శివాజీ, రోబో, రోబో 2, జైలర్ వంటి అనేక బ్లాక్ బస్టర్ హిట్‌ చిత్రాలతో అలరించారు.

ఈ క్రమంలో తన కెరీర్‌లో రజనీకాంత్‌ అనేక భిన్నమైన పాత్రలను పోషించారు. ఒకవైపు యాక్షన్‌ హీరాగా, మరోవైపు భావోద్వేగ ప్రధానమైన పాత్రల్లోనూ ఆయన మెప్పించారు. ఆయన చిత్రాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అనేక సార్లు సమాజానికి ఒక సందేశాన్ని కూడా అందించాయి. ముఖ్యంగా “బాషా” లోని హీరోయిజం, “నరసింహా”లోని జీవన పాఠాలు, “రోబో”లోని సాంకేతికత, “కాలా”లోని సామాజిక సందేశం— ఇవి ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.

రజనీకాంత్‌ విజయం వెనుక కేవలం నటన మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం, వినయంతో కూడిన జీవన విధానం కూడా ఒక పెద్ద కారణం. వ్యక్తిగత జీవితంలో సాధారణత, సౌమ్యత, అభిమానుల పట్ల చూపే అపారమైన ప్రేమ ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఇచ్చాయి. ఎంత పెద్ద స్టార్‌ అయినప్పటికీ, ఎప్పుడూ తన అభిమానులను గౌరవించడం, వారితో దగ్గరగా ఉండటం ఆయన ప్రత్యేకత.

అంతేకాకుండా, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కూడా రజనీకాంత్‌కు అపారమైన అభిమానులు ఉన్నారు. జపాన్‌, మలేషియా, సింగపూర్‌, శ్రీలంక, అమెరికా వంటి దేశాల్లో ఆయన చిత్రాలు విడుదలవుతాయి, అక్కడి ప్రేక్షకులు కూడా రజనీని ఆరాధిస్తారు. 50 ఏళ్ల కెరీర్‌లో రజనీకాంత్‌ అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. ఆయన ఏడుసార్లు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకోగా, వాటిలో ఆరు ఉత్తమ నటుడి విభాగంలో ఉన్నాయి.

సినిమా ఎక్స్‌ప్రెస్ మరియు ఫిల్మ్‌ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి అనేక అవార్డులను కూడా అందుకున్నారు. 1984లో ‘నల్లవనుకు నల్లవన్’ చిత్రానికి ఆయన తన ఏకైక ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే 45వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (2014) లో, రజనీకాంత్‌కు “సెంటెనరీ అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్” లభించింది.

ఇంకా పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ వంటి జాతీయ పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, విజయాన్ని సాధించారు. అందుకే ఆయన కథ అనేది కేవలం సినీ అభిమానులకే కాదు, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. 50 ఏళ్లపాటు అదే ఉత్సాహం, అదే కట్టిపడేసే శైలిని కొనసాగించడం అనేది ఓ అరుదైన విషయం.

వయసు పెరుగుతున్నా, ఆయనలోని ఎనర్జీ, అభిమానం, కృషి మాత్రం తగ్గడం లేదు. ఈ గోల్డెన్‌ జూబిలీ సందర్భంగా ఆయన అభిమానులు, సహచరులు, సినీ పరిశ్రమ మొత్తం రజనీని అభినందిస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. 50 ఏళ్లపాటు పరిశ్రమకు చేసిన సేవ, అందించిన వినోదం, సమాజానికి ఇచ్చిన సందేశం- ఇవి రజనీకాంత్‌ను కేవలం ఒక నటుడిగా కాకుండా, ఒక లెజెండ్‌గా నిలబెట్టాయి. రాబోయే రోజుల్లోనూ ఆయన అదే ఉత్సాహంతో, మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తారని అందరూ ఆశిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.