పవర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. రీ-రిలీజ్‌కి సిద్ధమైన జల్సా

Jalsa Re-Releasing on September 2nd, Powerstar Pawan Kalyan’s Birthday Special

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్‌ లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటైన ‘జల్సా’ సినిమాను 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ‘జల్సా’ రీ-రిలీజ్ అయ్యి రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మరోసారి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. పవన్ కళ్యాణ్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇప్పుడు 4K క్వాలిటీ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ఈ సినిమాను చూడటం అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.

అభిమానులు ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చే కలెక్షన్లను ఛారిటీకి విరాళంగా ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే ఉన్న ప్రత్యేకత. గతంలో రీ-రిలీజ్ అయినప్పుడు, ‘జల్సా’ ఒక రీ-రిలీజ్ సినిమాకు అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు మళ్ళీ అదే రికార్డును తిరిగి సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మళ్లీ ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ఫ్యాన్స్ నుండి వస్తున్న డిమాండ్ మేరకు, మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, అలాగే రీరిలీజ్ అయినప్పుడు థియేటర్లలో అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సెప్టెంబర్ 2న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సందర్భంలో థియేటర్లలో పవర్ స్టార్ మేనియా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.