కూలీ స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt Approves Benefit Shows and Ticket Price Hike For Rajinikanth's Coolie

సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కూలీ’. నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీని తెలుగులో అందిస్తున్న భాగస్వాములలో ఒకరైన ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ అభ్యర్థన మేరకు, ఈ చిత్రానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. కూలీ విడుదలవుతోన్న ఆగస్టు 14న ప్రత్యేక షోలు మరియు అదనపు టికెట్ రేట్ల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..

  • ఆగస్టు 14న ఉదయం 5:00 గంటలకు ప్రత్యేక షో నిర్వహించుకోవచ్చు (టికెట్ రేట్లపై ఎలాంటి పెంపు లేదు).
  • సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర రూ. 75 (GST సహా) పెంపు.
  • దీంతో సింగిల్ స్క్రీన్‌లలో టోటల్ టికెట్ రేట్ – రూ.222గా ఉండనుంది.
  • మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ. 100 (GST సహా) పెంపు.
  • దీంతో మల్టీప్లెక్స్‌లలో టోటల్ టికెట్ రేట్ – రూ.277గా ఉండనుంది.

కాగా ఈ రేట్లు ఆగస్టు 14 నుంచి 23, 2025 వరకు అమల్లో ఉంటాయి. రోజుకు గరిష్టంగా ఐదు షోలు మాత్రమే వేసుకోవాలి అని షరతు విధించారు. ఈ ఉత్తర్వులు ఏపీ రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తిస్తాయి. జిల్లా కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు, పోలీస్ కమిషనర్లు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక కూలీపై ఇప్పటికే భారీ క్రేజ్ నడుస్తోంది. ఈ ప్రభుత్వ అనుమతులతో విడుదల రోజు మరింత భారీ హంగామా ఉండనుంది. మొత్తానికి ఈ అప్డేట్స్ సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపనున్నాయి. అయితే రానున్న 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో దీని ప్రభావం కొంతమేర వసూళ్లపై పడొచ్చని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.