తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘మార్గన్’ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
కాగా ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. హీరో విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తుండగా.. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, మండ్ డెరిక్ ఎడిటింగ్, మాస్టర్ రాజశేఖర్ స్టంట్స్, శ్రీరమన్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























