సతీ లీలావతి ఫస్ట్ సాంగ్ ‘చిత్తూరు పిల్లా’ రిలీజ్

Sathi Leelavathi's First Single Chittoor Pilla Released, Creates A Musical Buzz

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ లీడ్ పెయిర్‌గా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. సీనియర్ నటుడు నరేష్ వీకే, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)’ ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే మేకర్స్ ఈ ఫ‌న్నీ ఎంట‌ర్‌టైన‌ర్ టీజర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘చిత్తూరు పిల్లా’ అనే ఫస్ట్ సింగిల్ విడుదలచేసింది. ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా.. గాయకులు నూతన మోహన్, కృష్ణ తేజస్వి మరియు రితేష్ జి రావు గాత్రం అందించారు.

ఈ సందర్భంగా సాంగ్ మేకింగ్ వీడియోను మిక్స్ చేశారు. ఇందులో సీనియర్ కొరియోగ్రఫర్ బృందా మాస్టర్ హీరో, హీరోయిన్లకు నృత్యరీతులను వివరిస్తున్నారు. ఈ పాట ‘లీలావతి వెడ్స్ రామ్ సేతు’ అంటూ మెయిన్ లీడ్స్ పెళ్లి సందర్భంగా రానున్నట్టు తెలుపుతోంది. ఈ సాంగ్ వివాహ వేడుకను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. మొత్తానికి ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ వీటిని శ‌ర‌వేగంగా పూర్తి చేసి త్వరలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం, బినేంద్ర మీనన్ కెమెరా, సతీష్ సూర్య ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.