ఎన్టీఆర్-హృతిక్‌ని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవట్లేదని పేర్కొన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మేరకు ఆయన ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘వార్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ మచ్ అవైటెడ్ మూవీ ఈనెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కార్యక్రమానికి హాజరైన త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “దేవర సమయంలో దేవర నామ సంవత్సరం అని చెప్పాను. ఇప్పుడు ఇది ‘హృతిక్ రామారావు’ నామ సంవత్సరం అని చెప్తున్నాను. నేనెంతో అభిమానించే వ్యక్తి ఎన్టీఆర్. సిల్వర్ స్క్రీన్‌కి వన్నె తెచ్చేవాడే ఎన్టీఆర్. నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్‌కు వెళ్లి చప్పట్లు కొట్టిన సినిమా ‘కహా నా ప్యార్ కియా’. ఆ సినిమా హీరో హృతిక్ రోషన్. నాకిష్టమైన దర్శకుల్లో అయాన్ ఒకరు. నా కుటుంబ సభ్యుల్లో ఒకరు నాగవంశీ. ఇలా నాకు నచ్చిన వ్యక్తులందరూ ఒకే చోట ఉండటం చాలా ఆనందంగా ఉంది.”
“సాంగ్ టీజర్లో వీరిద్దరి డ్యాన్స్ చూస్తుంటే మెరుపు తీగల్లా కదులుతున్నారు. సాధారణంగా ఈ సినిమాను యాక్షన్ సినిమాలా చూడడానికి ప్రయత్నించకండి. ఇందులో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. అలాంటి సినిమా కోసం ఎన్టీఆర్ వరకు రావాలా? ఎలాంటి భావాలనైనా పలికించేవాడు అనే కదా ఆయనకున్న పేరు. అందుకే ఈ సినిమా ఆయన వరకు వెళ్ళింది. బంగారం చేతిలో ఉంటే నగ చేయించుకోవాలనుకుంటాం కానీ, బీరువాలో దాచుకోవాలనుకోం కదా.”
“ఎన్టీఆర్‌తో ఏ నగ చేయించుకోవాలో అయాన్‌కు బాగా తెలుసు. ఈ ఇద్దరు స్టార్ హీరోలను అయాన్ చాలా బ్యాలెన్స్డ్గా చూపించాడని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఈ వినాయక చవితికి ‘వార్ 2’ సాంగ్ అన్ని చోట్లా వినిపిస్తుంది. ఎన్టీఆర్, హృతికి ఇద్దరూ.. ఒకరేమో వింధ్య పర్వతం, మరొకరేమో హిమాలయ పర్వతం. దేవర తరువాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఆ వెయిటింగ్ ముగిసింది. వార్ 2ని అందరూ థియేటర్లో చూసి ఆనందించండి” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























