సతీ లీలావతి ఫస్ట్ సింగిల్ ‘చిత్తూరు పిల్లా’ వస్తోంది

Sathi Leelavathi First Single Chittoor Pilla to be Out Tomorrow

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ లీడ్ పెయిర్‌గా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)’ ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే భార్య‌-భ‌ర్తల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గా కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు స‌త్య.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇక ఇటీవలే మేకర్స్ ఈ ఫ‌న్నీ ఎంట‌ర్‌టైన‌ర్ టీజర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది చిత్ర యూనిట్. రేపు ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘చిత్తూరు పిల్లా’ విడుదల కానున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.