సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో ‘అతడు’ సినిమా ఒకటి. 2005లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అద్భుతమైన కథ, త్రివిక్రమ్ మాటల మాంత్రికత, మహేష్ బాబు స్టైల్, హాస్యం, యాక్షన్ కలగలిపిన ఎంటర్‌టైన్మెంట్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. నేడు మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమా రీ-రిలీజ్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ‘అతడు’ రీ-రిలీజ్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. నైజాం ఏరియాలో ఏషియన్ సునీల్ భారీ ఎత్తున ‘అతడు’ను విడుదల చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MM, దేవి వంటి ప్రముఖ థియేటర్స్‌లో ఈ మూవీ విడుదలవుతుండగా, అక్కడ హౌస్‌ఫుల్ బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి..
ఈ నేపథ్యంలో ఉదయం నుంచే థియేటర్ల వద్దకు అభిమానులు భారీగా క్యూ కడుతున్నారు. బ్యానర్లు, కట్‌అవుట్లు, ఫ్లెక్సీలతో సినిమా హాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దీంతో ఆయా థియటర్లు సందడిగా మారాయి. థియేటర్‌లో ‘అతడు’ టైటిల్ కార్డ్ వచ్చి, మహేష్ బాబు స్క్రీన్‌పై కనిపించగానే చప్పట్లు, విసిల్స్‌తో హాలు మార్మోగిపోతోంది. అలాగే పాటలు, డైలాగులకు ఫ్యాన్స్ అరుపులు, కేరింతలతో థియేటర్లు హోరెత్తిపోతున్నాయి.
కాగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న మూవీ రిలీజ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున ఈలోపు తమ అభిమాన హీరోను ఒకసారి బిగ్ స్క్రీన్ పైన చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా ‘అతడు’ మరోసారి అభిమానులను థియేటర్లకు రప్పిస్తూ మాయ చేస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























