కోలీవుడ్ స్టార్ హీరో, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఫీనిక్స్’. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను మిళితం చేస్తూ, కొత్త హీరోకి సరైన లాంచింగ్ మూవీగా వుండబోతోంది. జూలై 4న ఫీనిక్స్ గ్రాండ్ థియేట్రికల్ విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సూర్య సేతుపతి పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కాగా, గతంలో ‘నానుమ్ రౌడీ ధాన్, సింధుబాద్’ వంటి చిత్రాల్లో స్మాల్ రోల్స్‌లో కనిపించాడు. ఇప్పుడు ఫీనిక్స్‌తో హీరోగా డెబ్యు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్లో సూర్య నటన గమనిస్తే తండ్రి విజయ్ సేతుపతిని గుర్తుకుచేస్తున్నట్టుగా ఉంది. అలాగే సామ్ సిఎస్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలువనుంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























