దసరా తరువాత నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.దసరా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబో లో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి.డిఫ్రెంట్ సబ్జెక్టు తో రా & రస్టిక్ గా తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా నుండి ఈ ఉదయం నాని ఫస్ట్ లుక్ ను అలాగే క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ఇందులో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సాయంత్రం మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది.ఈ పోస్టర్స్ తో సినిమాపై హైప్ మరింతగా పెంచేశారు మేకర్స్. ఈసినిమాలో నానిని చాలా వైలెంట్ గా చూపించనున్నాడు శ్రీకాంత్ ఓదెల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇందులో కిల్ ఫేమ్ రాఘవ జ్యూయెల్ కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సివుంది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.తెలుగు ,తమిళ, కన్నడ ,మలయాళం , హిందీ తోపాటు బెంగాలీ , ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ఇక రీసెంట్ గా హిట్ 3 తో వచ్చి కెరీర్ లో భారీ విజయాన్ని అందుకున్నాడు నాని. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈసినిమాతో నాని వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నాడు.మరి ది ప్యారడైజ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























