కేరళలో కూలీ హైప్ మాములుగా లేదు.ఈరోజు అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా ఓపెన్ అయ్యయోలేదో బుక్ మై షో లో గంటకు 40కు వేలకు పైగా టికెట్స్ తెగుతున్నాయి. ఆఫ్ లైన్ లో కూడా ఇదే క్రేజ్ వుంది.టికెట్ల కోసం ఫ్యాన్స్ థియేటర్ల ముందు క్యూ కట్టారు.ఇంకా ఈసినిమా రిలీజ్ కు 6 రోజుల సమయం వున్నా ఫస్ట్ డే నే సినిమా చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.కేరళ లో ప్రీ సేల్స్ 3 కోట్లు దాటాయి.ఇంతకుముందు లియో అక్కడ 4కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ఇప్పుడు కూలీ ఆ రికార్డు ను తిరగరాయనుంది.ట్రెండ్ చూస్తుంటే హిట్ టాక్ వస్తే కేరళలో కూలీ హైయెస్ట్ తమిళ గ్రాసర్ మూవీగా రికార్డు సృష్టించడం ఖాయం అనేలా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తమిళ నాడు ,తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కావాల్సివుంది.ఓవర్సీస్ లో కూడా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి.ఇప్పటివరకు అక్కడ ప్రీ సేల్స్ 30 కోట్లు దాటాయి.అన్ని భాషల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే మొదటి రోజు ఈసినిమా 100 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకోనుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటరైనర్ లో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు.ఉపేంద్ర ,షౌబిన్ షాహిర్,శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు.అనిరుధ్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.అయితే ఈసినిమా కు తెలుగు ,హిందీలో పోటీ ఎదురుకానుంది.కూలీ రిలీజ్ అవుతున్న రోజే వార్ 2 కూడా వస్తుంది.దాంతో బాక్సాఫీస్ వద్దా రెండు పెద్ద సినిమాల వద్ద వార్ జరుగనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































