మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘#Mega157’ (వర్కింగ్ టైటిల్). షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్, ముస్సోరీలోని బ్యూటీఫుల్ హిల్ స్టేషన్‌లో రెండవ షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం ఇటీవలే కేరళలో మూడో షెడ్యూల్ కూడా ముగించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఈనెల 22న చిరు జన్మదినం అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా Mega 157 నుండి ఒక బిగ్ అప్‌డేట్ రానుంది.
ఈ మేరకు డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఒక హింట్ ఇచ్చారు. దీనికి చిరంజీవి నటించిన పాత చిత్రంలోని ఫన్నీ క్లిప్ ఒకటి జోడించారు. దీంతో ఆరోజు వచ్చే అప్‌డేట్ ఏమై ఉంటుందా? అని మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ఇది, చిరు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ గురించే అయ్యి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఏ విషయం తెలియాలంటే, మరో 2 వారాలు ఆగాల్సిందే.
కాగా ఇందులో వింటేజ్ చిరుని చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. 1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను ఈసారి మళ్లీ చూపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరు ‘శివశంకర్ వరప్రసాద్’గా డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌లా ఉండనుంది. ఇక ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ తర్వాత నయనతార చిరుతో కలిసి మూడోసారి నటిస్తోంది.
ఇటీవల వచ్చిన ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన ట్రేడ్‌మార్క్, క్రియేట్ ప్రమోషన్స్ తో #Mega157పై ఇప్పటికే ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























