ది ప్యారడైజ్ ఫస్ట్ లుక్ రానుంది

The Paradise First Look to Be Unveiled Soon

రీసెంట్ గా హిట్ 3 తో వచ్చి కెరీర్ లో మరో భారీ విజయాన్ని అదనుకొని సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని.ఇక నాని నెక్స్ట్ ది ప్యారడైజ్ తో రానున్నాడు.దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.దాంతో అంచనాలు భారీగా వున్నాయి.డిఫ్రెంట్ సబ్జెక్టు తో రా & రస్టిక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఇప్పటివరకు 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 8న ఉదయం 10:05 గంటలకు  హీరో పాత్రకు పేరును రివీల్ చేసి సాయంత్రం 5:05 గంటలకు ఆ పాత్ర పరిచయం చేయనున్నారు.ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కిల్ ఫేమ్ రాఘవ జ్యూయెల్ కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సివుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.తెలుగు ,తమిళ, కన్నడ ,మలయాళం,హిందీ తోపాటు ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.

ఈసినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నాడు.నాని ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.చిరు కెరీర్ లో మోస్ట్ వైలెంట్ మూవీ గా తెరకెక్కనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.