మాస్, యాక్షన్ పాత్రలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన ట్యాలెంటెడ్ హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో ఆయన మళ్లీ సినిమాలలో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో తన పాత్రలను, స్క్రిప్ట్‌లను సెలెక్టివ్‌గా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు మంచు మనోజ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 21 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా.. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమాకు ‘డేవిడ్ రెడ్డి’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. టైటిల్ పోస్టర్‌తోనే ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం స్పష్టమవుతోంది. ఈ స్టోరీలో మనోజ్ ఎన్నడూ చూడని డిఫరెంట్ రోల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తుంది. తెరపై చూపించే విప్లవానికి టోన్‌ను సెట్ చేస్తుంది. టైటిల్ డిజైన్ని మనోజ్ ఫేస్‌లోకి మార్చడం చాలా క్రియేటివ్‌గా వుంది. “మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు!” అనే ట్యాగ్‌లైన్ కట్టిపడేసింది. విజువల్‌గా అద్భుతమైన పోస్టర్ సినిమా ఎంత పవర్ ఫుల్‌గా వుంటుందో తెలియజేస్తోంది.
పవర్ ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కథ 1897 నుంచి 1922 వరకూ నడుస్తుంది. కుల వ్యవస్థ ఒత్తిడుల నుంచి తిరగబడి, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఓ రెబల్ కథ ఇది. కథ రా, గ్రౌండెడ్, ఎమోషనల్ మాస్ టచ్‌తో జనం గుండెల్లో నిలిచిపోయేలా వుండనుంది. అలాగే హిస్టరీ, రెబెలియన్‌తో కూడిన ఈ చిత్రం తెలుగు సినిమాకి ఓ మైల్ స్టోన్ కానుంది.
ఇక ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో మనోజ్ పాత్ర ఎలా ఉండబోతోంది? డేవిడ్ రెడ్డి అనే క్యారెక్టర్లో ఆయన ఎలా కనిపించబోతున్నాడు? అనే విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. మొత్తానికి డేవిడ్ రెడ్డి సినిమాతో మనోజ్ సాలిడ్ హిట్ ఇవ్వనున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో మనోజ్ మళ్లీ తన మార్క్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నారు.
21 సంవత్సరాల క్రితం, ఇదే రోజున మంచు మనోజ్ ‘దొంగ దొంగది’తో అరంగేట్రం చేశారు. ఇప్పుడు, సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత, తన న్యూ బ్లాస్టింగ్ వెంచర్ డేవిడ్ రెడ్డిని ప్రకటించడం విశేషం. సినిమా ప్రేమికులకి ఇది మరిచిపోలేని మెమొరబుల్ మూమెంట్.
ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను వెల్వెట్ సౌల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మొటుకూరి భరత్ మరియు నల్లగంగుల వెంకట్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, మోషన్ పోస్టర్ వంటివి విడుదల కానున్నాయి. అలాగే సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా మేకర్స్ మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























