సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్టు 14న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ మరియు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు సినిమాలో నాగార్జున గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఫస్ట్ టైం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో నెగటివ్ రోల్ చేస్తున్నారు. లోకేష్ గారు తన సినిమాలో ప్రతి క్యారెక్టర్ని అద్భుతంగా డిజైన్ చేస్తారు. నాగార్జున గారు ‘అన్నమయ్య’తో ఒక కొత్త ట్రెండ్ ఎలా సెట్ చేశారో.. ఈ సినిమాతో ఇప్పుడు నెగిటివ్ రోల్లో అలాంటి కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు.” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నాగ్ నెగిటివ్ రోల్లో కనిపించడం ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్ కాబోతోంది. ప్రేక్షకులు కూడా ఇప్పుడు హీరోలని హీరోలుగా చూడటానికి ఇష్టపడటం లేదు. హీరోలు ఏదో కొత్తగా చేస్తేనే చూస్తున్నారు. ‘పుష్ప, కేజిఎఫ్’ ఇలా ఎన్నో సినిమాల్లో మనం చూసాం. న్యూ వరల్డ్‌లో వస్తున్న నాగార్జున గారికి వెల్కమ్. రజినీకాంత్ గారు ‘బాషా’ని గుర్తు చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్లో ఒక సెన్సేషన్ హిట్ కాబోతోంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన సన్ పిక్చర్స్ వారికి థాంక్యూ సో మచ్” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























