నాగార్జున గారి క్యారెక్టర్‌ని ఆడియన్స్ అందరూ లవ్ చేస్తారు – శృతి హాసన్

Nagarjuna’s Role Will Win Everyone’s Hearts in Coolie, Says Actress Shruti Haasan

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగస్టు 14న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా  మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ మరియు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్ గారికి థాంక్యూ.  నా క్యారెక్టర్ వెరీ స్పెషల్. రజనీకాంత్ గారితో వర్క్ చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు కూడా. ఈ సినిమాలో అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నాగార్జున గారు ఫెంటాస్టిక్. ఆడియన్స్ అందరూ కూడా ఆయన క్యారెక్టర్‌ని లవ్ చేస్తారు. ఆగస్టు 14న తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.  

అలాగే మరో కీలక పాత్రను పోషించిన సత్యరాజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇది వెరీ బిగ్ ఫిలిం. ఈ సినిమాలో పార్ట్  కావడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ స్టార్ రజిని గారు, కింగ్ నాగార్జున గారు, శృతిహాసన్, అమీర్ ఖాన్, సౌబిన్.. వీళ్ళందరితో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతి. ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద విజయం సాధించబోతోంది” అని అన్నారు.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.