‘హరిహర వీరమల్లు’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా ‘ఓజీ’ షూటింగ్ కూడా ముగించేశారు. వచ్చే నెల 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తోన్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా పూర్తైన షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, యాక్షన్ పార్ట్‌ను అలాగే ఒక సాంగ్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో మేకర్స్ సినిమాలో క్లైమాక్స్ భాగానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ హీరో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పవన్ సీరియస్ లుక్‌తో యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్న ఈ పిక్ ఆకట్టుకుంటుంది. ఇందులో పవన్ గెటప్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. అలాగే దీనికి “మాటిస్తే.. నిలబెట్టుకోడం , మాట మీదే..నిలబడ్డం, మీరు పక్కనుంటే , కరెంటు పాకినట్టే” అంటూ హరీష్ ఇచ్చిన క్యాప్షన్ అదిరిపోయింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో పవన్‌కు జోడిగా శ్రీలీల, రాశీఖన్నా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ మరియు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కు ప్రత్యేక సమయం కేటాయిస్తూ షూట్ పూర్తి చేస్తున్నారన్నది ఫ్యాన్స్‌కు చాలా పాజిటివ్ న్యూస్‌గా మారింది. సినిమా తాలూకు లేటెస్ట్ అప్డేట్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























