హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమాని నేను రిలీజ్ చేసేలా అనుగ్రహించిన నరసింహ స్వామివారికి నమస్కారం. హోంబలే ఫిల్మ్స్ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. నిర్మాత విజయ్ గారు ఫోన్ చేసి, ఈ సినిమాని తెలుగులో మీరు విడుదల చేయాలని అని అడిగారు. అంతకుమించి ఏం మాట్లాడుకోలేదు. వెంటనే ఓకే అన్నాను. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు.”
“సినిమా విడుదలైన రోజు మార్నింగ్ షోకి వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈవెనింగ్ కొన్ని షోస్ పెంచాం. మరుసటి రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నాం. ఈ సినిమా దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. 2021లో సినిమాని మొదలుపెట్టి ఎన్నోఒడిదొడుకులు ఎదుర్కొని, పట్టుదలతో సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. ఆ నరసింహ స్వామి వారే వారికి ఈ అద్భుతమైన విజయాన్ని అందించారు.”
“భారతదేశం అంతటా ప్రేక్షకులు ఈ సినిమాకి జేజేలు పలుకుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఎంబీలో 200 మంది స్వాములు ఈ చిత్రాన్ని చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడూ థియేటర్స్ రాని ప్రేక్షకులు ఈ సినిమాని వీక్షిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఉద్వేగంతో తమ తోటివారితో సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. ఈ వేడుకు అతిధులు విచ్చేసిన భరణి గారికి, జొన్నవిత్తుల గారికి ధన్యవాదాలు.”
“మా కుటుంబంలో, సన్నిహితులు, పరిచయం ఉన్నవారందరిలో సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతాం. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని ఆయన చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ప్రేక్షకులకు తీసుకెళ్లిన మీడియా వారికి, సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























