జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు

71th National Film Awards Telugu Movies Steal The Spotlight

సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు విశేషంగా నిలిచాయి. కథ, దర్శకత్వం, నటన, సాంకేతికత ఇలా అన్ని విభాగాల్లో తెలుగు సినిమాలు ప్రాముఖ్యతను చాటాయి. భారతీయ సినిమాకే దిక్సూచి అయిన తెలుగు ఇండస్ట్రీ, తన గొప్పతనాన్ని మళ్లీ ఒకసారి నిరూపించుకుంది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జాతీయ అవార్డులు ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో ఈసారి ఏకంగా ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు వరించాయి. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలనచిత్రం, ఉత్తమ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రఫీ, బెస్ట్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ సింగింగ్‌ వంటి విభాగాల్లో తెలుగు చిత్రాలు అవార్డులను దక్కించుకున్నాయి. అలాగే కాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి ‘గాంధీతాత చెట్టు’ సినిమాలో నటనకు గానూ ఉత్తమ బాలనటి కేటగిరిలో అవార్డు గెలుచుకోవడం విశేషం.

ఈ విజయం తెలుగు సినిమా నిర్మాణ విలువలు, కథానాయకత్వం, సమకాలీనతకు నిదర్శనంగా నిలిచి తెలుగువారికి గర్వకారణం అయ్యాయి. జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు తెలుగు సినిమా ప్రతిష్ఠను మరింతగా పెంచింది. భవిష్యత్‌లో మరిన్ని కథా ప్రయోగాలు, కొత్త పంథాలో రూపొందే చిత్రాలకు ఇది ప్రేరణగా నిలుస్తుంది.

  • ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలనచిత్రం – భగవంత్‌ కేసరి
  • బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – సుకృతి వేణి (గాంధీతాత చెట్టు)
  • బెస్ట్ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – హనుమాన్‌
  • బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రఫీ – హనుమాన్‌
  • బెస్ట్‌ స్క్రీన్‌ప్లే రైటర్‌ – సాయిరాజేష్‌ (బేబీ)
  • బెస్ట్‌ సింగింగ్‌ (మేల్) – పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (బేబీ)
  • బెస్ట్ లిరిసిస్ట్ – కాసర్ల శ్యామ్‌ (బలగం)
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.