వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ డైరెక్టర్ బాబీ కొల్లి తన తర్వాతి సినిమాను కన్నడ టాప్ బ్యానర్ కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో చేయబోతున్నాడు. ఈరోజు బాబీ పుట్టినరోజు సందర్బంగా ఈ అనౌన్స్ మెంట్ వచ్చింది.ప్రస్తుతం బాబీకి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇక కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలను నిర్మిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో కన్నడ హీరో యష్ తో చేస్తున్న టాక్సిక్ ఒకటి.భారీ బడ్జెట్ తో గీతూ మోహన్ దాస్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ తో కెవిఎన్ ప్రొడక్షన్స్ జన నాయగన్ చేస్తుంది.విజయ్ కి ఇది చివరి సినిమా.ఇక ఇప్పుడు ఈ సంస్థ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.
కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ ను బాబీ బాగా డీల్ చేయగలడు.రీసెంట్ గా డాకు మహారాజ్ తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇంతవరకు బాబీ ప్లాప్ అనేదే లేకుండా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.ఇక ఇప్పుడు పెద్ద నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ తో మూవీ ఓకే చేశాడు.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నాడు. ఇంతకుముందు ఆహీరో తో సినిమా చేసి కెరీర్ బిగెస్ట్ హిట్ కొట్టాడు బాబీ.ఇక ఇప్పుడు మరోసారి ఆ హీరో తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.ఈనెలలోనే ఈసినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























