ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో కీలక పాత్ర పోషించే స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఇటీవల కొత్తగా ‘బీవీ వర్క్స్’ పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి సంయిక్తంగా ఆయన రూపొందిస్తున్న సినిమా ‘మిత్ర మండలి’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ మరియు ఇందులో నటించే నటీనటులను రివీల్ చేశారు మేకర్స్. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇక మూవీ నుండి టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మిత్ర మండలి నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘స్వేచ్చా స్టాండు’ అంటూ సాగే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేస్తోంది. ఈ పాటకు ఆర్ఆర్ ధృవన్, విజయేందర్ ఎస్ సాహిత్యం సమకూర్చగా.. గాయకులు ధనుంజయ్ సీపాన, ఆర్ఆర్ ధృవన్ అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ పాట అయితే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
కాగా ఫన్, మిస్టరీ జానర్‌లో తెరకెక్కుతున్న మిత్ర మండలి చిత్రంతో విజయేందర్ ఎస్ దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























