వచ్చిన వాడు గౌతమ్ నుండి అశ్విన్ బాబు పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్

Ashwin Babu Intense Poster Released From Vachinavaadu Gautam

యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలు పెంచింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి తాజాగా ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయనకి ముందస్తు విషెష్ అందించిన చిత్ర యూనిట్.. నిన్న ఒక స్పెషల్ పోస్టర్ విడుదలచేసింది. అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, కీలక పాత్రలు పోహిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. ఇటివలే భారీ బడ్జెట్‌తో హైవోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తి చేశారు. హై టెక్నాలజీని వాడి ఈ యాక్షన్ సీక్వెన్స్‌ షూట్ చేశారు. ఎలాంటి రాజీ లేకుండా, పెద్ద చిత్రాలకు ఏమాత్రం తీసిపోని ప్రొడక్షన్‌ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాకి ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆయన విజువల్‌ ప్రెజెంటేషన్‌ ఈ క్లైమాక్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. అలాగే గౌర హరి మ్యూజిక్, M R వర్మ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. ప్రవల్లిక యోగి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.