డకాయిట్.. స్టన్నింగ్ లుక్‌లో మృణాల్ ఠాకూర్

Mrunal Thakur’s Birthday Poster Unveiled From Adivi Sesh’s Dacoit

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డకాయిట్’. ఇప్పటికే లీడ్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేసిన పవర్ గ్లింప్స్ రిలీజ్‌తో ఈ మూవీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు షానియల్ డియో దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మృణాల్ ఠాకూర్ బర్త్‌డే సందర్భంగా ఆమెను పవర్‌ఫుల్ అండ్ ఇమోషనల్ అవతార్‌లో చూపిస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో మృణాల్ చేతిలో గన్ పట్టుకొని ఎయిమ్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఆక్రోశం, బాధ, ఫైటింగ్ స్పిరిట్ అన్నీ ఒక్కటే టైంలో కనిపిస్తున్నాయి. ముఖంపై చిన్న చిన్న గాయాలు, కన్నీళ్లు ఆమె పాత్రకు ఉన్న ఎమోషనల్ వెయిట్‌ని సూచిస్తున్నాయి.

ఇక ఈ కథలో జూలియెట్ కేవలం లవ్ ఇంటరెస్ట్ కాదు, రివెంజ్ డ్రామాకి సెంట్రల్ క్యారెక్టర్. మృణాల్ పోషించిన జూలియట్ పాత్ర తెలుగులో ఇప్పటివరకు చూసిన హీరోయిన్ల కంటే వేరే లెవెల్లో ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకి సంబంధించి లీడ్ యాక్టర్స్‌తో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా డకాయిట్ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.