పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ రానుందని తెలిసిందే.ఇక ఈరోజు డేట్ కూడా చెప్పేశారు.ఆగస్టు 2న ఈ సాంగ్ ను వదలనున్నామని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.మరి సాంగ్ వచ్చాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.ఇక ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓజీ పవన్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తిచేసుకుంది.అన్ని ఏరియాల్లో భారీ బిజినెస్ చేసింది.సెప్టెంబర్ 25 ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే అదే రోజు బాలకృష్ణ , బోయపాటి శ్రీను అఖండ 2 కూడా వస్తుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెసింగ్ క్లాష్ జరుగనుంది.
ఇదిలావుంటే రీసెంట్ గా హరి హర వీరమల్లు తో ప్రేక్షకులముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొనుంటున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో లో షూటింగ్ జరుగుతుంది.ఈవారంలో పవన్ షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























