కన్నడ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ హిందీలో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది.హిందీ సినిమా సైయారా తో పోటీని తట్టుకొని అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంది.వీక్ డేస్ లోకూడా రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా హిందీలో 5కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో మొత్తం 6 రోజుల్లో 25.31 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఫుల్ రన్ లో 50కోట్ల మార్క్ టచ్ చేసేలానే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత కొంత కాలంగా తెలుగు ,కన్నడ నుండి డివోషనల్ టచ్ తో వచ్చిన సినిమాలు హిందీలో కాసులు కురిపిస్తున్నాయి.కార్తికేయ 2, కాంతార, హనుమాన్ ఈసినిమాలు అక్కడ బిగెస్ట్ హిట్లుగా నిలిచాయి.ఇక ఇప్పుడు మహావతార్ నరసింహ హిందీలో అదరగొడుతుంది.తెలుగులో కూడా నిన్నటి వరకు ఈసినిమా మంచి రన్ ను కనబరిచింది కానీ ఈరోజు నుండి భారీ పోటీ ఎదురుకానుంది.ఎందుకంటే ఈరోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ థియేటర్లలోకి వచ్చింది.ఓవరాల్ గా లిమిటెడ్ బడ్జెట్ తో యానిమేటెడ్ మూవీ గా వచ్చిన మహావతార్ నరసింహ అన్ని భాషల్లో కలిపి ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.
విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ మూవీ తెలుగు రాష్ట్రాలలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలైంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























