విజయ్ దేవరకొండ కింగ్డమ్ రేపే థియేటర్లలోకి రానుంది.ట్రైలర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.దానికి తోడు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కావడం కూడా సినిమాకు మరింత అడ్వాంటేజ్ అయ్యింది. బుకింగ్స్ అయితే సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షో లో గత 24గంటల్లో 70వేలకు పైగా టికెట్లు తెగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూఎస్ఏ లో హాఫ్ మిలియన్ మార్క్ చేరువలో వుంది. ఓవరాల్ గా చూస్తే ప్రీ సేల్స్ 11 కోట్లు దాటాయి.విజయ్ గత సినిమాల ప్రభావం కింగ్డమ్ పై పడలేదు.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కింగ్డమ్ మొదటి రోజు 30 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టుకోనుంది.అదే జరిగితే విజయ్ కెరీర్ లో ఈసినిమా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.మరి కొన్ని గంటల్లో రిజల్ట్ తెలిసిపోనుంది.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను తెరకెక్కించగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.అనిరుధ్ సంగీతం అందించాడు.నాగవంశీ ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మిస్తున్నారు.హిందీలో ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలకానుంది.
ఇక ఈసినిమాపై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.చాలా ఏళ్ళ నుండి తను ఓ భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. మరి ఈసినిమాతో విజయ్ సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























