కింగ్డమ్ నుండి ‘రగిలే రగిలే’ సాంగ్ రిలీజ్

Ragile Ragile Song Released From Kingdom

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ నటుడు స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలచేసిన ట్రైల‌ర్‌ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుండి తాజాగా ఒక అదిరిపోయే పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘రగిలే రగిలే’ అంటూ సాగే ఈ పాట సాంగ్ మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచింది. “కింగ్డమ్ ఆగ్రహం రగిలే రగిలే రూపంలో వచ్చేసింది! అందరినీ ఉర్రూతలూగించే అడ్రెనలిన్ రష్‌, గూస్‌బంప్స్ కలిగించే మాస్ ఎనర్జీకి సిద్ధమవ్వండి!” అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే ఉంది. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్దార్థ్ బస్రూర్ పవర్‌ఫుల్ వాయిస్‌తో ఆలపించారు.

ఇక ఈ పాటలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, స్టయిలిష్ యాక్షన్ మూమెంట్స్, పవర్‌పుల్ లుక్స్ మాస్ ప్రేక్షకులను ఊపేస్తున్నాయి. ఈ సాంగ్‌కి మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ మరోసారి తన మేజిక్‌ చూపించాడు. ఇక లిరిక్స్ పాక్షికంగా ప్రజల రగిలే మూడ్‌ను, విజయ్ పాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించాయి. విజువల్‌గా భారీ స్థాయిలో చిత్రీకరించబడిన ఈ పాట, థియేటర్లలో మరింతగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. మొత్తానికి ‘రగిలే రగిలే’ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇదిలావుంటే, మరోవైపు కింగ్‌డమ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బుక్ మై షోలో ఆన్‌లైన్‌ లింక్ ఒకటి ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంచినట్టు మేకర్స్ తెలిపారు. ‘https://in.bookmyshow.com/movies/devarakonda/kingdom/ET00433664‘ అనే ఈ లింక్ ద్వారా టికెట్స్ పొందవచ్చని సూచించారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న (ఈ గురువారం) థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.