తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి. ఏ రగ్గడ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా నిన్న థియేటర్లలో విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు విజయ్ సేతుపతి కెరీర్ లో బిగెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఫుల్ రన్ లో అక్కడ ఈసినిమా 50కోట్లకుపైన వసూళ్లను రాబట్టుకోనుంది.సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈసినిమాను నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో ‘సార్ మేడమ్’ గా విడుదలకానుంది.తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేశారు. ఆగస్టు 1న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. అయితే సరిగ్గా ఒక్క రోజు ముందు విజయ్ దేవరకొండ, కింగ్డమ్ వస్తుంది.ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. దాంతో సర్ మేడమ్ కి తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.
ఇక విజయ్ సేతుపతి ప్రస్తుతం టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తున్నాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఛార్మి తోకలిసి పూరి సినిమాను నిర్మిస్తున్నారు.ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో రానుంది.ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























