విజయ్ దేవరకొండ కింగ్డమ్ మరో 5రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ గత చిత్రాలు నిరాశపరిచిన కింగ్డమ్ పై అంచనాలు భారీగా వున్నాయి. కీలకమైన ట్రైలర్ ఈరోజు రిలీజ్ కానుంది. ట్రైలర్ వచ్చాక సినిమా హైప్ మరింతగా పెరగనుంది.ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో కట్ చేశారు.విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.ఈ ఈవెంట్ వేదిక ను కూడా ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు.ముఖ్య అతిథిగా ఎవరిని తీసుకొస్తారో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. మూవీ లో వైలెన్స్ ఎక్కువగా ఉండడం తో ఏ సర్టిఫికెట్ వస్తుందని మేకర్స్ అనుకున్నారు కానీ సెన్సార్ బోర్డు యు/ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో రిలీజ్ కుముందు ఊరట లభించింది.హిట్ టాక్ వస్తే కింగ్డమ్ మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
ఇక విజయ్ ప్రస్తుతం మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు.అందులో ఓ సినిమాను రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో చేయనున్నాడు. దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నారు.అలాగే విజయ్ , టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ తో తన 14వ సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈ రెండు సినిమాలను ఒకే సారి పూర్తి చేయాలని విజయ్ చూస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























