యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కె – రాంప్ షూటింగ్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.అందులో భాగంగా కేరళలో కీలకమైన షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా రీసెంట్ గా కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది.ఈ షెడ్యూల్ షూటింగ్ ఎలాంటి బ్రేక్ లేకుండా జరుగుతుంది.ఈ సందర్భంగా లొకేషన్ లోని హీరో స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వచ్చే నెలలో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమాలో కిరణ్ మాస్ గా కనిపించనున్నాడు.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తుండగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుంది.చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన నిర్మాత రాకేష్ దండా నిర్మిస్తున్నారు.అక్టోబర్ 18న ఈసినిమాను థియేటర్లోకి తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఏడాది కిరణ్ కి ఏది సెకండ్ రిలీజ్ కానుంది. క తరువాత ఈ సమ్మర్ లో దిల్ రూబా తో రాగ ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.దాంతో కిరణ్,కె – రాంప్ తో హిట్ కొట్టి ఎలాగైనా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.త్వరలోనే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఈసినిమా తోపాటు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.నంబూరి రవి డైరెక్షన్ లో ప్రేమ కథా చిత్రం గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ నటిస్తుండగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.బేబి డైరెక్టర్ సాయి రాజేష్ ,ఎస్ కె ఎన్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఇది కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























