యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా తో రానున్నాడు.నీరజ కోనా ఈసినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.మల్లికా గంధ అంటూ సాగే ఈ పాట ఈనెల 28న రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ను కృష్ణకాంత్ రచించగా ప్రముఖ సింగర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు.ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు పెంచనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుసు కదాలో సిద్దు సరసన రాశి కన్నా ,నిధి శెట్టి హీరోయిన్లు గా నటించగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అక్టోబర్ 17న థియేటర్లోకి రానుంది. ఇక గత ఏడాది సమ్మర్ లో టిల్లు స్క్వేర్ తో వచ్చి 100కోట్ల క్లబ్ లో చేరిన సిద్దుకి ఈ సమ్మర్ లో జాక్ షాక్ ఇచ్చింది.ఇక ఇప్పుడు తెలుసు కదాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు సిద్దు.
ఇక ఈసినిమా తరువాత సిద్దు జొన్నలగడ్డ ,కృష్ణ అండ్ హిజ్ లీల ఫేమ్ రవికాంత్ పెరుపు డైరెక్షన్ లో బ్యాడాస్ లో నటించనున్నాడుది.సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించనున్నాయి.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























