శాండల్‌వుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో వస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌తో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్‌తో అలరించబోతోంది. ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మహావతార్ నరసింహ 3Dలో ఐదు భారతీయ భాషలలో విడుదలవుతుండగా.. తెలుగు రాష్ట్రాలలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విజువల్ వండర్ తెరలను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక యానిమేటెడ్ ఫ్రాంచైజీ లైనప్‌ను ఇటీవలే మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగనుంది. పురాణాలలో చెప్పబడిన మహా విష్ణువు దశావతారాలను తెరపైకి ఆవిష్కరిస్తుంది. దీనిలో భాగంగా ముందుగా మహావతార్ నరసింహ వస్తుండగా.. మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) రాబోతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























