అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న హరి హర వీరమల్లు

Advance bookings for Hari Hara Veera Mallu are on fire

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ కి పర్మిషన్ రావడంతో ఈరోజు రాత్రి 9 గంటల నుండే షోస్ స్టార్ట్ కానున్నాయి.ఇక ఈసినిమాకు భారీ హైప్ వుంది.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టికెట్ హైక్ కూడా ఉండడంతో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మొదటి రోజు 70 నుండి 80కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది. పవన్ కూడా ప్రమోషన్స్ లోకి దిగడం మరింత అడ్వాంటేజ్ అయ్యింది. ప్రస్తుతం వైజాగ్ లో ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.గతంలో ఏ సినిమాకు చేయనంత ప్రమోషన్స్ చేస్తున్నాడు పవన్.తొలి రోజు హరి హర వీరమల్లు దాదాపు వరల్డ్ వైడ్ గా 2000 కు పైగా స్క్రీన్ లలో రిలీజ్ అవుతుంది.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా నిధి అగర్వాల్ ,బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మించారు.

ఇక చాలా గ్యాప్ తరువాత పవన్ తన సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.మరి హరి హర వీరమల్లు పవన్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.ఈసినిమా తరువాత పవన్ నెక్స్ట్ ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్ లతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.