‘మార్కో’ హీరో మరో యాక్షన్ ఫిల్మ్ షురూ

Marco Fame Unni Mukundan Join Hands With Director Joshiy For New Film

మాలీవుడ్ డైరెక్టర్ జోషీ ఓ లెజెండరీ పర్సనాలిటీ. ఆయన డైరెక్షన్‌లో ఇంతకుముందు వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఓ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ స్పెషల్‌ గ్రాండ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మెప్పడియాన్’ తర్వాత వంద కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో దూసుకెళ్లిన ‘మార్కో’ వంటి సినిమాలతో UMF స్టాండర్డ్‌ను నెస్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు జోషీ లాంటి మాస్టర్ డైరెక్టర్‌తో చేతులు కలపడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక హీరోగా ఉన్ని ముకుందన్ తన కెరీర్‌లో ఎప్పుడూ చూడని లుక్‌లో, మాస్ యాక్షన్ అవతారంలో కనిపించబోతున్నాడు.

అభిలాష్ ఎన్. చంద్రన్ ఈ సినిమాకి కథ మరియు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు . ‘పొరింజు మరియమ్ జోస్’, ‘కింగ్ ఆఫ్ కొథా’ వంటి సినిమాలకు రాసిన ఈయన ఎమోషన్ అండ్ డెప్త్ ఉన్న క్యారెక్టర్‌లు రాయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు ఈ సినిమా కూడా మాస్ యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో ఉండబోతోంది.

ఈ సినిమా నిర్మాణంలో భాగమైన ఐన్స్టిన్ మీడియా ఇటీవలే ‘ఆంటోనీ’, ‘పురుష ప్రేతం’ వంటి యూనిక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్, క్వాలిటీ కంటెంట్‌కి పేరు తెచ్చుకున్న ఈ బ్యానర్ కూడా ఈ సినిమాతో సత్తా చాటబోతోంది. అలాగే “Driven by Passion, Now Fuelled by Ego” అనే నినాదంతో ఉన్ని ముకుందన్ ఫిలింస్ (UMF) ఫ్యామిలీస్ అండ్ యూత్ రెండింటినీ అలరిస్తూ పవర్‌ఫుల్ కథలతో ముందుకెళ్తోంది. ఈ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా… బిగ్ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.