చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ కూడా ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారు.పవన్ పార్ట్ తాలూకు షూట్ ను ఈనెలలో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుండనున్నారని తెలిసిందే. అందులో ఓ హీరోయిన్ గా శ్రీలలీ నటిస్తుండగా మరో హీరోయిన్ గా రాశి ఖన్నా ను తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న తను షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది.ఇందులో రాశి ఖన్నా ,శ్లోక అనే పాత్రలో కనిపించనుంది.ఈరోజు ఈ విషయాన్ని చిత్ర బృందం సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అఫీషియల్ గా ప్రకటించింది.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఇక ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ కూడా కంప్లీట్ చేశాడు.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మెహన్ హీరోయిన్ గా నటిస్తుంది.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.ఇదిలావుంటే మరో రెండు రోజుల్లో పవన్ ,హరి హర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.భారీ బడ్జెట్ తో ఏ ఎం రత్నం ఈసినిమాను నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























