కూలీ థర్డ్ సింగిల్ ‘పవర్ హౌస్’ రిలీజ్

Coolie Third Single Power House Released

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా రజినీ బర్త్ డే సందర్భంగా ‘చికిటు వైబ్’ పేరుతో విడుదలచేసిన స్పెషల్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండు పాటలను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌‌‌‌‌‌‌‌ అందుకున్నాయి. వీటిలో రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేసిన పూజా హెగ్డే మెరిసిన ‘మోనికా’ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా కూలీ సినిమా నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ మేరకు నేడు అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లో నిర్వహించిన స్పెషల్ ఈవెంట్‌లో దీనిని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ‘పవర్‌హౌస్’ అంటూ సాగే ఈ మూడో పాట ఓ రేంజ్‌లో ఉంది. హీరో క్యారక్టరైజేషన్‌ను పవర్ ఫుల్ వేలో ప్రజెంట్ చేసింది. మొత్తానికి ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

కాగా సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన కూలీ దాదాపు రూ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఇక ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 14న కూలీ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.