కింగ్‌డ‌మ్.. ‘అన్న అంటేనే’ సాంగ్‌కి ఆనంద్ దేవ‌ర‌కొండ‌ స్పెషల్ వీడియో

Anand Deverakonda Shares Special Video For Anna Antene Song From Kingdom

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్‌డ‌మ్’. ఈ నెల 31న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను పెంచేయగా.. రీసెంట్‌గా చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ‘అన్న అంటేనే..’ సాంగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ పాట అన్నదమ్ముల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో మ్యూజిక్ లవర్స్‌తో పాటు జనరల్ ఆడియెన్స్‌ని కూడా బాగా ఇంప్రెస్ చేసింది. ఇక ఈ పాట సోదరుల అనుబంధానికి సంబంధించినది కావడంతో విజయ్ సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో భావోద్వేగానికి లోనైన ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ వీడియోను షేర్ చేశారు. దీనిని తమ చిన్ననాటి ఫోటోలు, వీడియోలతో రూపొందించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది.

ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. “ఈ పాటను మొదటిసారి వినగానే నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. నా కలలు నాకే కనిపించనప్పుడు కూడా అవి నెరవేర్చతావని నమ్మినవాడు ఆయన. అతడు ఎప్పుడూ నాకు అండగా ఉన్నాడు. మన సోదరులను మనం ఎంత తక్కువగా అర్థం చేసుకుంటామో, వాళ్లను ఆ పాత్రలోనే నిరంతరం చూస్తూ, అది చెప్పకుండానే అర్థమవుతుందని అనుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. ఈ పాట, మన బంధాన్ని గుర్తించి, ఆప్యాయంగా సెలబ్రేట్ చేయడానికి మంచి అవకాశం అనిపించింది. అన్నా అంటేనే… ❤️.. నా అన్నయ్య విజయ్ దేవరకొండకు ❤️.” అని పేర్కొన్నాడు.

కాగా కింగ్‌డ‌మ్ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా.. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ అన్నగా నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.