మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : కిరిటీ , శ్రీ లీల ,జెనిలియా ,రవి చంద్రన్
సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం :రాధాకృష్ణ రెడ్డి
నిర్మాణం : వారాహి చలన చిత్రం
ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమార్ కిరీటి నటించిన తొలి చిత్రం జూనియర్. కన్నడ ,తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈసినిమాలో సెన్సేషనల్ యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా చాలా గ్యాప్ తరువాత జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ టెక్నిషియన్స్ దేవి శ్రీ ప్రసాద్ ,సెంథిల్ కుమార్ ఈసినిమాకు పనిచేయడంతో అంచనాలు వచ్చాయి.ఇక రీసెంట్ గా వచ్చిన వైరల్ వయ్యారి సాంగ్ తో సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చింది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి జూనియర్ ఎలా వుందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
అభి ( కిరిటీ) అంటే తండ్రి (రవిచంద్రన్)కు విపరీతమైన ప్రేమ. అతి గారాభం భరించేలేక అభి, తండ్రికి దూరంగా పారిపోతూవుంటాడు.అయితే కాలేజ్ లో సత్య ( శ్రీ లీల)ను చూసి అభి ఇష్టపడతాడ .తన కోసమే ఓ కంపెనీలో వుద్యోగంలో చేరతాడు.ఇక ఆ కంపెనీకి కాబోయే సీఈఓ విజయ (జెనీలియా)కి అభి అంటే పడదు. అయితే ఓ పని మీద ఇద్దరు కలిసి విజయనగరం వెళ్లాల్సివస్తుంది. ఇంతకీ ఆ ఊరికి ,విజయకి వున్న సంబంధం ఏంటి ? చివరికి ఏమైంది అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
రెగ్యులర్ స్టోరీనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు రాధాకృష్ణ.ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.కొత్త హీరో ని పెట్టుకొని సినిమాను బాగానే డీల్ చేశాడు.ఫస్ట్ హాఫ్ అంతా రెగ్యులర్ ఫార్మాట్ లోనే వున్నా ఆకట్టుకుంటుంది.హీరో చేసే డ్యాన్స్ , యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి.ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే వైరల్ వయ్యారి పాట థియేటర్ ను షేక్ చేసింది.సెకండ్ హాఫ్ అంతా విలేజ్ లోనే జరుగుతుంది.దాన్ని ఎమోషనల్ గా నడిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు.ఇది కూడా చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది.అయితే కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉండడం మైనస్ అని చెప్పొచ్చు.ఇక క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ సూపర్ అనిపిస్తుంది.ఓవరాల్ గా జూనియర్ డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే తొలి సినిమా అయినా కిరీటి అదరగొట్టాడు.సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడు.డ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాలి.శ్రీ లీల ను డామినెట్ చేశాడు.యాక్షన్ సన్నివేశాలు కూడా ఈజ్ తో చేసుకుంటూ వెళ్ళిపోయాడు.కొన్ని చోట్ల తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను ఫాలో అయ్యాడు.స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు.ఈసినిమా కిరీటి కెరీర్ కు బాగానే ఉపయోగపడుతుంది.కరెక్ట్ స్టోరీ పడితే తనకంటూ ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకోవడం ఖాయం.ఇక శ్రీ లీల అయితే తనకు అలవాటైన పాత్రలో కనిపించింది.సెకండ్ హాఫ్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ.అలాగే 12 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన జెనిలీయా కు మంచి రోల్ దొరికింది.ఇందులో ఆమె నటన కూడా మెప్పిస్తుంది.ఇక హీరో తండ్రి గా రవిచంద్రన్ ,విలన్ గా అచ్యుత్ కుమార్ తమ అనుభవాన్ని చూపించారు.
టెక్నికల్ గా సినిమా ఉన్నంతగా వుంది. ప్రముఖ కెమెరామెన్ సెంథిల్ కుమార్ విజువల్స్ ఆకట్టుకుంటాయి.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ అని చెప్పొచ్చు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బానే ఇచ్చాడు.ఎడిటింగ్ ఓకే .వారాహి నిర్మాణం రిచ్ గా వుంది.కొత్త హీరో అని చూడకుండా సినిమా కోసం బాగానే ఖర్చు చేశారు.
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన జూనియర్ డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.కిరీటి నటన ,ఫస్ట్ హాఫ్ ,సంగీతం సినిమాలో హైలైట్ అయ్యాయి .రెగ్యులర్ మూవీస్ ను ఇష్ట పడే వారు జూనియర్ ను ఓసారి చూసేయొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























