కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘ధనం మూలం ఇదం జగత్’ అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన కుబేర థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. డైరెక్టర్ సహా స్టార్ కాస్టింగ్ అంతా తొలిసారి తమ కంఫర్ట్ జోన్స్ నుంచి బయటకువచ్చి చేసిన ఈ మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను కళ్లజూసింది.
ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ మార్క్ అందుకుని అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ధనుష్, నాగార్జున కెరీర్‌లో ఈ ఘనత అందుకున్న తొలిచిత్రంగా నిలిచింది. బిచ్చగాడిగా ధనుష్ అద్భుతమైన నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అలాగే నాగార్జున సీబీఐ ఆఫీసర్‌గా కనిపించడం ప్రేక్షకులను అలరించింది. వీటికితోడు ఇంకా గోల్డెన్ లెగ్ రష్మిక లక్ కూడా ఈ సినిమాకి కలిసొచ్చిందనే చెప్పాలి.
దీంతో కుబేర సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి కుబేర స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ప్రస్తుతం ఇది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.
కథ:-
నీరజ్ మిత్ర (జిమ్ సర్భ్) ఒక పెద్ద పారిశ్రామికవేత్త. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఆయన ప్రపంచంలోనే ధనవంతుడు అనిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. తన కంపెనీకి 15 ఏళ్లుగా సరిపడే చమురు నిల్వలు దొర్కుతాయి. మంత్రితో రహస్య ఒప్పందం చేసుకుంటే ఆ నిల్వలపై పూర్తి హక్కులు తనకే ఉంటాయి అని భావిస్తాడు. అయితే ఇక్కడే అతనికి ఓ చిక్కు ఎదురవుతుంది.
ఈ ప్రక్రియ మొత్తం సాఫీగా జరగాలంటే కొన్ని అక్రమాలకు పాల్పడాల్సి వుంటుంది. ఈ క్రమంలో నాలుగు బినామీ ఖాతాలలో రూ.50వేల కోట్లు బదిలీ చేయాల్సి వస్తుంది. దీనికోసం నీరజ్ దీపక్ (నాగార్జున)ని ఎంచుకుంటాడు. దీపక్ నిజాయితీగల ఒక సీబీఐ అధికారి. కొన్ని కారణాలతో అతడు జైలులో ఉంటాడు. వ్యవస్థ పైన అతనికి చాలా కోపం ఉంటుంది.
ఈ నేపథ్యంలో తన పని పూర్తి చేసుకోవడానికి దీపక్‌ని ఉపయోగించుకోవాలనుకుంటాడు నీరజ్. అతడిని జైలు నుంచి బయటకు రప్పించి తన సహాయంతో నలుగురు బినామీలను రిక్రూట్ చేసుకుకోవాలి అనుకుంటాడు. దీపక్‌కి ఇది అక్రమం అని తెలిసినా, జైలు నుండి బయటికి వచ్చి కుటుంబంతో గడపాలి అనే ఉద్దేశంతో ఈ పనికి ఒప్పుకుంటాడు.
ఇక బినామీలను రిక్రూట్ చేసే క్రమంలో దీపక్ చాలా ఆలోచిస్తాడు. ఆ నలుగురు బినామీలు బిచ్చగాళ్ళు అయితే ఫ్యూచర్‌లో రిస్క్ ఉండదు అని బిచ్చగాడైన దేవా (ధనుష్)తో పాటుగా మరో ముగ్గురు బెగ్గర్స్‌ని కలుస్తాడు. అయితే డబ్బు వస్తుంది కదా అని ఈ పనికోసం తొలుత ఒప్పుకున్న దేవా, ఆ తర్వాత ఇందులో ఏదో మతలబు ఉందని, భవిష్యత్తులో తన లైఫ్‌కి రిస్క్ ఉండొచ్చు అని ఎస్కేప్ అవుతాడు.
అయితే దీపక్‌కి దేవా దొరికాడా? విషయం తెలిసిన నీరజ్ ఏం ప్లాన్ వేశాడు? దేవా ప్రాణాలకు నిజంగానే ప్రమాదం ఏర్పడిందా? బిచ్చగాడైన దేవా ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? నిజాయితీ కలిగిన ఆఫీసర్ అయిన దీపక్ చివరివరకూ నీరజ్ పక్కన నిలబడగలిగాడా? దీపక్ దేవాని కాపాడాడా? ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన నీరజ్‌ని దేవా ఎదుర్కోగలిగాడా? నీరజ్ వేసిన ఈ బడా స్కెచ్‌కి కౌంటర్ ప్లాన్ వేశాడా? అసలు దేవా ఎవరు? తను బిచ్చగాడిగా ఎందుకు మారాడు? అలాగే ఈ కథలో సమీరా (రష్మిక) పాత్ర ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























