సినిమా బండితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన నెక్స్ట్ మూవీ. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ,రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ యత్ర నార్యస్తు అనే పాటను కూడా లాంచ్ చేశారు. ఆగస్టు 22న పరదా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో భాగంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..
అందరికి నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సత్యదేవ్ గారికి సురేష్ బాబు గారికి థాంక్యూ వెరీ మచ్. ఇది చిన్న సినిమా అంటున్నారని ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచుకున్న కంటెంట్ చాలా పెద్దది. ఇందులో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. మీరు తప్పకుండా సినిమా చూడండి. అది మీకు అర్థమవుతుంది. ఆగస్టు 22న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. ఫైనల్ గా సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. ఇది చాలా బోల్డ్ స్టెప్. ఇలాంటి సపోర్ట్ లేకపోతే మేము ఏమి చేయలేం. పరదా సినిమాని మీరందరూ కూడా బిగ్ స్క్రీన్ లో చూడాలనేది మా డ్రీమ్. ఒక స్టిరియోటైప్ బ్రేక్ చేయడం మా అందరి అల్టిమేట్ గోల్.నిజానికి ఈసినిమా ఏడాది క్రితమే రెడీ అయ్యింది. అయితే ప్రాపర్ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూశాం. ఫైనల్ గా సినిమా మీ ముందుకు రానుంది. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.సినిమా చూడండి. కచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. థాంక్యూ వెరీమచ్ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























