బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2.ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ విజయాలను సాధించాయి.దాంతో ఇప్పుడు రానున్న అఖండ 2పై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్లే.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంటే ఆగస్టు లో కంప్లీట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా వాయిదా పడనుందని డిసెంబర్ కు వెళ్లనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.అఖండ 2 చెప్పిన డేట్ కే రానుంది. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతుంది.ఓటీటీ డీల్ కూడా ఫైనల్ అవుతుంది.ఎలాంటి వాయిదా లేకుండా చెప్పిన తేదీకే సెప్టెంబర్ 25న విడుదలకానుందని వెల్లడించారు.అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ కూడా విడుదలవుతుంది.ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి.దాంతో రెండు సినిమాలు ఓకే రోజు వస్తే బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.
అఖండ 2లో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.ఈసినిమా కూడా హిట్ అయితే బాలకృష్ణ వరసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.అఖండ నుండి బాలకృష్ణ వరస హిట్ల తో దూసుకుపోతున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























