విష్ణు మంచు హీరోగా టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత మంచి పాజిటివ్ టాక్‌తో అంచనాలకు మించి విజయం సాధించింది. భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కన్నప్ప చిత్రానికి ఓ అరుదైన గౌరవం లభించింది. తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై సినిమాను వీక్షించారు. ఈ మేరకు కన్నప్ప టీమ్ సోషల్ మీడియా వేదికగా.. “మాటల్లో చెప్పలేని గౌరవం! కన్నప్పకు రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక ప్రదర్శన లభించింది, దాని భక్తితో నడిచే కథ చెప్పడం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు గర్వకారణమైన గుర్తింపు.” అని పేర్కొంది.
కాగా కన్నప్ప సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రుద్ర’ అనే ప్రత్యేక పాత్రలో మెరిశారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే మంచు ఫ్యామిలీ మూడోతరం వారసులు అరియానా, వివియానా, మాస్టర్ అవ్రామ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
ఇక కన్నప్ప చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు, ‘రామాయణ్, మహాభారత్’ వంటి పౌరాణిక మరియు ‘తెనాలి రామ, మేరే సాయి’ వంటి భక్తి రస సీరియల్స్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు. డీఓపీ షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించగా.. ఆంథోనీ ఎడిటింగ్ నిర్వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























