మెగాస్టార్ బర్త్ డే రోజున వస్తోన్న ‘పరదా’

Anupama Parameswaran's Paradha Release Date Fix

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది ‘టిల్లు స్క్వేర్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఆమె ఇప్పుడు ‘పరదా’ అనే చిత్రంలో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో, సినిమా టీజర్‌, ‘మా అందాల సిరి’ అనే సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంతో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండగా.. సీనియర్ నటి సంగీత మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా పరదా చిత్రం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాను మెగాస్టార్ బర్త్ డే రోజు (ఆగస్టు 22)న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.

ఇక ఈ సందర్భంగా మూవీ థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వనమాలి సాహిత్యం అందించిన ఈ పాటను గాయకుడు అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. ‘యత్ర నార్యస్తు’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది. ఇక ఈ మూవీతో ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనున్నట్టు చిత్ర బృందం పేర్కొంది.

కాగా ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి మరియు శ్రీధర్ మక్కువతో కలిసి నిర్మాత విజయ్ డొంకాడ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ప్రత్యంగిర సంస్థ దక్కించుకోగా.. మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.