పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈనెల 24న థియేటర్లలోకి రానుంది.చాలా గ్యాప్ తరువాత పవన్ నుండి వస్తున్న సినిమాకావడంతో హరి హర వీర మల్లు పై భారీ అంచనాలు వున్నాయి.ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చాలా రోజుల తరువాత తెలుగులో విడుదలవుతున్న పెద్ద సినిమా కూడా ఇదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రమోషన్స్ లో కూడా నిధి చాలా యాక్టీవ్ గా పాల్గొంటుంది.ఇక ఈసినిమా సెకండ్ పార్ట్ కూడా రానుందని తెలిసిందే. అయితే ఆల్రెడీ సెకండ్ పార్ట్ కు సంబంధించి 20 నిమిషాల ఫుటేజ్ షూటింగ్ కూడా పూర్తయిందని నిధి అగర్వాల్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.ఇక ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే బ్యాలెన్స్ సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేయనున్నారు.
పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మించారు.హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఈజీగా 200కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























