పలు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక వాయిదా పడిన మచ్ మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతుంది.మరోసారి వాయిదా లేకుండా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.తెలుగు తోపాటు తమిళ , హిందీ లో రిలీజ్ కానుందని ఇంతకుముందే ప్రకటించారు.అయితే రీసెంట్ గా ఈసినిమా హిందీ లో రావడం లేదని వార్తలు వచ్చాయి.కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ప్రోమో లో కూడా తెలుగు ,తమిళ్ రిలీజ్ అని వుండడం ఆ వార్తలకు బలం చేకూర్చించింది. అయితే ఈ హిందీ రిలీజ్ గురించి నిర్మాత నాగవంశీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కింగ్డమ్ హిందీ రిలీజ్ ఉంటుంది. ప్రస్తుతం టైటిల్ కోసం చూస్తున్నాం.కింగ్డమ్ అనే టైటిల్ ఆల్రెడీ హిందీలో రిజిస్టర్ చేసుకొని ఉండడం తో మరో టైటిల్ తో రిలీజ్ చేయాలి. సామ్రాజ్య్ ఇలాంటి టైటిల్స్ అనుకుంటున్నాం.టైటిల్ లేదనే రిలీజ్ డేట్ ప్రోమో హిందీలో విడుదలచేయాలేదని తొందర్లోనే టైటిల్ ప్రకటిస్తామని నాగవంశీ వెల్లడించాడు.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.మరోవైపు విజయ్ కి ఈసినిమా విజయం సాధించడం తప్పనిసరి కానుంది.మరి ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























