కింగ్‌డమ్ నుండి ‘అన్న అంటేనే’ సాంగ్ రిలీజ్

Kingdom Second Single Anna Antene Released

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. కొన్నిరోజుల క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్‌ ‘హృదయం లోపల’ విడుదల చేయగా మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కింగ్‌డమ్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘అన్న అంటేనే’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. అనిరుధ్ హృద్యమైన గాత్రంతో ఆలపించారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సాంగ్‌లో విజయ్ అన్నగా ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కనిపించారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.