నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఆమెకు జోడీగా ట్యాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి కనిపించనున్నాడు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘నదివే’ అంటూ సాగే ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన ట్యూన్ అందించాడు. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను హేషమ్ స్వయంగా ఆలపించారు. టీజర్ సాంగ్‌ని మరిపించేలావుంది ఈ పాట. ఇప్పటివరకూ వచ్చిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకునేలా ఉండి సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























